![]() |
![]() |
.webp)
హైపర్ ఆది రీసెంట్ గా జబర్దస్త్ కమెడియన్ వేణు గురించి ఒక పాడ్ కాస్ట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వేణు అంటే ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్ గా గుర్తొచ్చేవాడేమో ఎప్పుడైతే ఒక ఎమోషనల్ మూవీ తీసి అందరితో కన్నీళ్లు పెట్టించి జీవితం అంటే ఇదే అనిపించాడో అప్పటి నుంచి బలగం వేణు అని పేరు తెచ్చుకున్నాడు. ఆ మూవీ ఇప్పుడు అతని ఇంటి పేరైపోయింది. ఇక ఆది వేణు గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. "జబర్దస్త్ కమెడియన్స్ అనగానే ఆ ఏమయ్యా అని కొంచెం తక్కువ చేసి మాట్లాడేవాళ్ళందరికీ కూడా కమెడియన్స్ అందరి మీద ఒక గౌరవం పెరిగేలా చేసింది వేణు అన్న. ఆ విషయంలో వేణు అన్నకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక జబర్దస్త్ కమెడియన్ అలాంటి సినిమా తీస్తాడని ఎవరూ ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు.
.webp)
ఏదో కామెడీ సినిమా తీసేస్తారు రెగ్యులర్ గా జబర్దస్త్ లో చేసేదే ఇక్కడ చేస్తారు అని అలాంటి సిట్యుయేషన్ లో ఆలోచించిన ప్రతీ ఒక్కరికీ ఈరోజు జబర్దస్త్ కమెడియన్ ఒక సినిమా కథ చెప్తాను అంటే రండి బ్రదర్ అని పిలిచి కూర్చోబెట్టి చెప్పండి అని చాలా జాగ్రత్తగా వినేంత గౌరవాన్ని తీసుకొచ్చాడు వేణు అన్న. ఆ విషయంలో మేమందరం గర్వపడతాం. మేము ఎప్పుడు కలిసినా ఇదే విషయం మాట్లాడుకుంటూ ఉంటాం. తెలంగాణ గురించి తీసిన సినిమాయేమో ఆంధ్ర వాళ్లకు కూడా ఎమోషన్స్ బాగా ఎక్కేలాగా తీశారు. బేసిక్ గా జరిగే ఇన్సిడెంట్స్ కాబట్టి అవన్నీ చాలా చాలా బాగా తీసాడు. అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. నా వరకు చిన్న సినిమాల్లో అదొక బాహుబలి అంతే. " అన్నాడు ఆది. 2022 లో వచ్చిన డీజే టిల్లు మూవీలో వేణు నటనకు ఆడియన్స్ అంతా ఫిదా ఇపోయారు. దాంతో అతని లైఫ్ ఒక్కసారిగా టర్న్ ఐపోయింది.
![]() |
![]() |